Wednesday, January 21, 2009

కల్పనా పెన్ సెంటరు ఆయన

నిన్న 40 యేళ్ళ తర్వాత ఓ వ్యక్తిని చూసాను. వెంటనే గుర్తు పట్టేసి అడిగాను. మీరు ఫలానా కదా అని. ఆయన ముఖం వెలిగిపోయింది. 1960-70ల్లో విజయవాడ బీసెంట్ రోడ్ లో కల్పనా పెన్ సెంటర్ గుర్తున్న వాళ్ళకి ఆయన తప్పకుండా గుర్తుంటారు. నేను 7, 8 క్లాసులు చదివేటప్పుడు ఆయన దగ్గర పెన్నులు కొనేవాడిని. ఆయనపేరు అప్పుడు నాకు కూడా తెలీదు. కల్పనా పెన్ సెంటరు ఆయన, అంతే. నిన్న తెలిసింది ఆయన పేరు వెంకటాద్రి అని. ఎన్నో రకాల పెన్నులు అమ్మడమే కాదు పెన్నులు కొన్న వారు వెడితే ఫ్రీ సర్వీస్ కూడా చేసే వాడు. యెవరైనా ఆయనగురించి జ్ఞాపకాలు ఉంటే రాయండి.